తారక్, కొరటాల భారీ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Jul 2, 2021 2:00 pm IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళితో భారీ మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం అనంతరం కూడా తారక్ సాలిడ్ లైనప్ ను రెడీ చేసుకొని ఉన్నారు. మరి వాటిలో తన బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో ప్లాన్ చేసిన మరి భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కూడా ఉంది.

మరి ప్రస్తుతం చేస్తున్న “RRR” అయ్యిన వెంటనే ఆ సినిమాను కూడా స్టార్ట్ చేసేయాలని ప్లాన్ లో ఉన్నారు. అయితే ఇపుడు ఈ సినిమాపైనే ఆసక్తికర బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో ఓ స్ట్రాంగ్ క్యారెక్టర్ కి ఓ బాలీవుడ్ స్టార్ నటుడిని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. మరి అది ఎవరు ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది..

మరి వీటితో పాటుగా ఆల్రెడీ ఈ చిత్రంలో కియారా అద్వానీ పేరు హీరోయిన్ రేస్ లో వినిపిస్తుండగా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం ఇవ్వనున్నాడని టాక్. ఇక సాలిడ్ ప్రాజెక్ట్ ను యసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :