థలా అజిత్ “వలిమై” షూట్ లేటెస్ట్ అప్డేట్.!

Published on Aug 20, 2021 8:00 am IST

ప్రస్తుతం మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర మంచి మోస్ట్ అవైటెడ్ గా ఉన్న పలు చిత్రాల్లో కోలీవుడ్ స్టార్ హీరో థలా అజిత్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “వలిమై” కూడా ఒకటి. అజిత్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకొని ఎదురు చూస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్నాడు. మరి ఇదిలా ఉండగా ఒక్కో అప్డేట్ కి కూడా సాలిడ్ హైప్ తెచ్చుకుంది.

మరి భారీ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై లేటెస్ట్ అప్డేట్ ఒకటి తెలుస్తుంది. ప్రెజెంట్ ఈ చిత్రం ఫైనల్ షెడ్యూల్ లోకి ఎంటర్ అయ్యిందట. ప్రస్తుతం చిత్ర యూనిట్ అంతా రష్యా దేశానికీ పయనం అయ్యినట్టు తెలుస్తుంది. అక్కడ పలు కీలక ఎపిసోడ్స్ ని వారం రోజులు పాటు షూట్ చేయనున్నట్టు తెలుస్తుంది.

ఈ నెల 23 నుంచి చివరి వరకు కూడా ఈ షూట్ కొనసాగనుందట. దీనితో ఈ చిత్రం షూట్ అంతా కంప్లీట్ అవ్వనుందట. మరి ఈ చాలా అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రానికి యువన్ ఎలెక్ట్రిఫయింగ్ సంగీతం అందిస్తుండగా బోనీ కపూర్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే మేకర్స్ ఈ చిత్రాన్ని దీవాళీ కానుకగా రిలీజ్ చెయ్యనున్నారు.

సంబంధిత సమాచారం :