థలా అజిత్ “వాలిమై” యాక్షన్ తో సమానంగా సెంటిమెంట్.!

Published on Jun 22, 2021 9:00 am IST

కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన మాస్ క్రౌడ్ పుల్లర్ థలా అజిత్ కూడా ఒకరు. ఇంకా తెలుగులో మార్కెట్ పెద్దగా ఏర్పడలేదు కానీ తమిళనాట మాత్రం అజిత్ సినిమాలు భారీ వసూళ్లనే రాబడతాయి. మరి అలా ఇప్పుడు తాను చేస్తున్న లేటెస్ట్ చిత్రం “వాలిమై” పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇపుడు లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. మొదటి నుంచి ఈ చిత్రం ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెలిపారు. కానీ ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు అద్భుతమైన అమ్మ సెంటిమెంట్ కూడా ఉంటుందట. దీనిపైనే కోలీవుడ్ స్టార్ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది.

అంతే కాకుండా ఓ అమ్మ పాట కూడా ఆల్రెడీ ట్యూన్ చేసినట్టు శంకర్ తెలిపాడు. దీనితో ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా మరింత దగ్గర కానుంది అని చెప్పాలి. ప్రస్తుతానికి అయితే ఈ చిత్రం ఫస్ట్ లుక్ కోసం అజిత్ అభిమానులు ఎంతో కాలం నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :