ఎట్టకేలకూ ఫిబ్రవరి సెకెండ్ వీక్ లో మొదలవుతుందట !

ఎట్టకేలకూ ఫిబ్రవరి సెకెండ్ వీక్ లో మొదలవుతుందట !

Published on Jan 24, 2019 11:51 PM IST

trivikram allu arjun

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన తరువాత చిత్రాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల విజయాల తరువాత వీరిద్దరూ కలిసి మూడోసారి చేస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానుల్లో భరోయ్ అంచనాలే ఉన్నాయి.

కాగా ఈ సినిమా ఫిబ్రవరి సెకెండ్ వీక్ నుండి షూట్ కి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన నటించే హీరోయిన్నీ కూడా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు.

బన్నికి జోడిగా కియారా అద్వానీ హీరోయిన్ గా తీసుకోబోతున్నారట. ఆమె తాజాగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడిగా ‘వినయ విధేయ రామ’లో నటించింది. ఈ చిత్రం రోజే విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది.

తాజా వార్తలు