‘కబ్జ’ భారీ ఓపెనింగ్స్ రాబడుతుందా ?

Published on Mar 13, 2023 11:22 pm IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర మన దక్షిణాది నుంచే అనేక సినిమాలు ఆల్ మోస్ట్ భారీ ఎత్తున విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలో ఇండియ‌న్ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర హీరోగా న‌టిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘కబ్జ’ కూడా రాబోతుంది. పునీత్ రాజ్‌కుమార్ జ‌యంతి సంద‌ర్భంగా మార్చి 17న తెలుగు, క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ అవుతుంది.

ఆర్‌.చంద్రు ద‌ర్శ‌క నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ప్ర‌ముఖ నిర్మాత ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి స‌మ‌ర్ప‌కుడిగా హీరో నితిన్ సొంత బ్యానర్స్ రుచిరా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఎన్ సినిమాస్ ప‌తాకాల‌పై తెలుగులో రిలీజ్ అవుతుంది. మరి ఈ కన్నడ చిత్రం ఏ రేంజ్ ఓపెనింగ్స్ ను సాధిస్తుందో చూడాలి. ప్రస్తుతానికి ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :