విజయ్ దేవరకొండ “ఖుషి” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on May 23, 2022 10:00 am IST

మన టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం పలు ఇంట్రెస్టిగ్ సినిమాలు భారీ ప్రాజెక్ట్ లు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వాటిలో ఆల్రెడీ పాన్ ఇండియా సినిమా “లైగర్” రిలీజ్ కి రెడీగా ఉండగా రెండు చిత్రాలు అనౌన్స్ అయ్యాయి. అయితే వాటిలో హిట్ దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ “ఖుషి” కూడా ఒకటి.

స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న ఈ చిత్రం రీసెంట్ గానే అనౌన్స్ అయ్యి షూటింగ్ కూడా స్టార్ట్ చేసుకోగా ఇప్పుడు షూట్ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. మరి మేకర్స్ ఇప్పుడు కాశ్మీర్ లో స్టార్ట్ చేసిన ఫస్ట్ షెడ్యూల్ ని విజయవంతంగా కంప్లీట్ చేసేసారట. అలాగే నెక్స్ట్ షెడ్యూల్ లో భాగంగా హైదరాబాద్ లో నెక్స్ట్ స్టార్ట్ చెయ్యబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ చిత్రానికి హీషమ్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :