షూట్ లో పాల్గొనబోతున్న ‘ఎన్టీఆర్ కుమార్తె’ !

Published on Oct 1, 2018 4:55 pm IST

నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా క్రిష్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ప్రస్తుతం నలభై రోజుల లాంగ్ షెడ్యూల్ కి సన్నద్ధం అవుతుంది. అయితే భారీ తారాగణం నటిస్తోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరిగారి పాత్రలో, ప్రముఖ నృత్య కారణి హిమన్సీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే హిమన్సీ, పురందేశ్వరిగారిని కలిసి ఆమెకు సంబంధించిన విషయాలను తెలుసుకున్నారు. ఆమె పాత్రలో ఎలా నటించాలో.. అచ్చం ఆమెలానే హావభావాలను ఎలా పలికించాలో.. ఇప్పటికే హిమన్సీ రిహార్సల్స్ కూడా చేశారట.

కాగా, తాజా సమాచారం ప్రకారం.. ఈ నెల మూడో తారీఖు నుండి హిమన్సీ ఎన్టీఆర్ షూట్ లో పాల్గొంటారని తెలుస్తోంది. హిమన్సీకు, ఎన్టీఆర్ గారి సతీమణి బసవతారకంగారి పాత్రను పోషిస్తోన్న విద్యాబాలన్ కు మధ్య కొన్ని సీన్లు ఉన్నాయని.. ఇప్పుడు జరగబోయే షెడ్యూల్ లో వాటినే చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. సెకెండాఫ్ లో వచ్చే ఈ సీన్లు సినిమాకే చాలా కీలకమట, కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల చెయ్యడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

సంబంధిత సమాచారం :