సవ్యసాచిలోని స్పెషల్ సాంగ్ లో తమన్నా లేదట !

సవ్యసాచిలోని స్పెషల్ సాంగ్ లో తమన్నా లేదట !

Published on Sep 16, 2018 12:36 PM IST

Savyasachi

శైలజారెడ్డి అల్లుడు చిత్రంతో తన కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ను సాధించి ఫుల్ జోష్లో వున్నాడు యువ సామ్రాట్ నాగ చైతన్య. ఇక ఇప్పుడు తన ఏకాగ్రతనంత ‘సవ్యసాచి’ చిత్రం ఫై పెట్టాడు. ప్రస్తుతం ఈచిత్ర షూటింగ్ హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యకమైన సెట్ లో జరుగుతుంది.

ఈ షెడ్యూల్లో చైతు అలాగే హీరోయిన్ నిధి అగార్వల్ ఫై నాగార్జున నటించిన ‘అల్లరి అల్లుడు’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘నిన్ను రోడ్డు మీద చుసినాక’ అనే రీమిక్స్ సాంగ్ ను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ స్పెషల్ సాంగ్ లో చైతు తో తమన్నా నర్తిస్తుందని అప్పట్లో వార్తలు వచ్చాయి . కానీ ఇప్పుడు హీరో హీరోయిన్లపైనే ఈసాంగ్ చిత్రీకరణ జరుపుతున్నారు.

‘ప్రేమమ్’ తరువాత చందు మొండేటి -చైతు కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీనియర్ యాక్టర్స్ మాధవన్, భూమిక చావ్లా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. మంచి అంచనాల మధ్య ఈ చిత్రం నవంబర్ 2న ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు