‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లేటెస్ట్ యూఎస్ కలెక్షన్స్ !

Published on Apr 1, 2019 6:15 pm IST

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కి వచ్చిన రివ్యూస్ ఎలా ఉన్నా.. ప్రేక్షకులు మాత్రం సినిమా పై బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. విడుదలైన తెలంగాణ మరియు ఓవర్సీస్ లో మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ నే సాధించింది ఈ చిత్రం.

అయితే ఈ చిత్రం ఇప్పటివరకూ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 243,720 డాలర్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ రోజు నుంచి కలెక్షన్స్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. మరి మొత్తానికి రాబోయే రోజుల్లో ఈ చిత్రం కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

ఇక ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా రిలీజ్ కోసం చిత్రబృందం సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. కానీ సుప్రీంకోర్టులో కూడా ఈ సినిమాకి అనుకూలంగా తీర్పు వచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :