విజయ్ 65వ సినిమా డైరెక్టర్ కూడా ఫిక్స్

Published on Jan 19, 2020 10:30 pm IST

‘మెర్సల్, సర్కార్, బిగిల్’ వంటి వరుస విజయాల తర్వాత హీరో విజయ్ చేస్తున్న చిత్రం ‘మాస్టర్’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే విజయ్ తన 65వ సినిమాను కూడా ప్లాన్ చేసి పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని పాండియరాజ్ అనే దర్శకుడు డైరెక్ట్ చేయనున్నారట.

పాండియరాజ్ గతంలో కార్తితో ‘కాడైకుట్టి సింగం’, శివ కార్తికేయన్ హీరోగా ‘నమ్మ వీట్టు పిళ్లై’ లాంటి హిట్ సినిమాల్ని తెరకెక్కించారు. పాండియరాజ్ చెప్పిన స్టోరీ నచ్చడంతో విజయ్ సినిమాకు ఓకే చెప్పారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అందాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

X
More