‘రాజ్ తరుణ్‌’ పై లావణ్య తీవ్ర ఆరోపణలు !

‘రాజ్ తరుణ్‌’ పై లావణ్య తీవ్ర ఆరోపణలు !

Published on Apr 19, 2025 10:01 PM IST

Raj Tarun

‘రాజ్ త‌రుణ్ ప్రేయ‌సి’ లావ‌ణ్య, రాజ్ త‌రుణ్ త‌న‌ను మోసం చేశాడంటూ ఆ మధ్య ఆరోపణల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరి వ్యవహారం మళ్లీ ముదురుతోంది. మొన్న లావణ్య తనపై రాజ్ పేరెంట్స్ దాడి చేయించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఐతే, తాజాగా మరోసారి లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ కు వెళ్లి మళ్లీ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో లావణ్య మాట్లాడుతూ.. ‘నాపై రాజ్ తరుణ్‌, శేఖర్ భాషా కుట్రలు చేస్తున్నారు. నన్ను చంపేయాలని వారిద్దరూ చూస్తున్నారు. అందులో భాగంగానే రాజ్ పేరెంట్స్ ఇంటికి వచ్చారు. 15 మంది వచ్చి నాపై దాడి చేసినా పోలీసులు పట్టించుకోలేదు’ అని లావణ్య తెలిపింది.

లావణ్య ఇంకా మాట్లాడుతూ.. ‘నేను వారి పై ఫిర్యాదు చేసి గంటలు గడుస్తున్నా వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదో నాకు అర్థం కావట్లేదు. నిన్న సాయంత్రం కూడా నా ఇంటికి నలుగురు మహిళలు వచ్చారు’ అంటూ లావణ్య చెప్పుకొచ్చింది. ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో బతుకుతున్నా. వారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు. నేను చనిపోయాక వారిని అరెస్ట్ చేస్తారా. రాజ్ తరుణ్‌, శేఖర్ భాషా నా మీద కుట్రలు చేస్తున్నారు. వారి నుంచి నన్ను కాపాడాలని కోరుకుంటున్నా. నేను న్యాయం కోసమే పోరాడుతున్నా’ అంటూ తెలిపింది లావణ్య. మరి లావణ్య ఆరోపణల్లో ఎన్ని నిజాలు ఉన్నాయో పోలీసులే తేల్చాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు