పవర్ స్టార్ సినిమాలో యంగ్ హీరోయిన్ ?

Published on Mar 25, 2020 11:00 pm IST

టాలెంటెడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. కెరీర్ మొదట్లో బాగానే ఆఫర్లు అందుకున్న ఈ అందాల భామ స్టార్ డమ్ ను మాత్రం సంపాధించులేకపోయింది. ఈ మధ్యే ‘అర్జున్ సురవరం’తో హిట్ అందుకున్న ఈమెకు ప్రస్తుతం రెండు ఆఫర్లు చేతిలో ఉన్నాయి. ఇవి కాకుండా ఆమెకు ఒక పెద్ద ఆఫర్ అందినట్టు ఫిల్మ్ నగర్ టాక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 28వ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో కథానాయకిగా లావణ్య త్రిపాఠి నటించవచ్చే అవకాశం ఉందట. నమ్మశక్యం కాని ఈ వార్త ఎంతవరకూ నిజమవుతుందో చూడాలి.

ఇక గతంలో హరీష్, పవన్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ పవన్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. అప్పటికి వరుస ప్లాప్స్ లో ఉన్న పవన్.. గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. దాంతో ఇప్పుడు హరీష్ – పవన్ చేయబోతున్న సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’తో పాటు క్రిష్ సినిమా కూడా చేస్తున్నాడు. క్రిష్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మొదటిసారి పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తవగానే హరీష్ శంకర్ చిత్రం మొదలుకానుంది.

సంబంధిత సమాచారం :