‘మామ మంచు అల్లుడు కంచు’ కోసం భారీ ఏర్పాట్లు

‘మామ మంచు అల్లుడు కంచు’ కోసం భారీ ఏర్పాట్లు

Published on Dec 16, 2015 5:00 PM IST

mama-manchu-alludu-kanchu1
కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు – కామెడీ కింగ్ అల్లరి నరేష్ కాంబినేషన్ లో మంచు విష్ణు నిర్మాతగా చేసిన సినిమా ‘మామ మంచు అల్లుడు కంచు’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇటీవలే ఈ సినిమా ఆడియోని హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఆడియోకి మంచి రెస్పాన్స్ రావడంతో ఆడియో సక్సెస్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించడానికి సిద్దమయ్యారు.

ఆడియో లాంచ్ ఎలాగు హైదరబాద్ లో చేసారు, అలాగే ఈ మధ్య కాలంలో చాలా తెలుగు సినిమాల ఈవెంట్ లని ఆంధ్ర ప్రదేశ్ లో చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఉదాహరణకి బాలకృష్ణ డిక్టేటర్ సినిమా ఆడియో అమరావతిలో జరగనుంది. దాంతో మామ మంచు అల్లుడు కంచు టీం కూడా ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతిలో డిసెంబర్ 19వ తేదీన అంగరంగ వైభవంగా సినిమా ఆడియో సక్సెస్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేయడానికి ప్లాన్ చేస్తోంది. మోహన్ బాబు సరసన రమ్యకృష్ణ, మీనా హీరోయిన్స్ గా నటించగా, అల్లరి నరేష్ సరసన పూర్ణ హీరోయిన్ గా కనిపించనుంది. శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాకి డైరెక్టర్.

తాజా వార్తలు