చరణ్ పాత్రలో లారెన్స్?

Published on Aug 8, 2020 8:48 am IST

2018లో వచ్చిన రంగస్థలం భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పీరియాడిక్ రివేంజ్ డ్రామాగా సుకుమార్ తెరకెక్కించగా చిట్టి బాబు పాత్రలో రామ్ చరణ్ అద్భుతం చేశారు. ఈ మూవీ తమిళ్ రిమేక్ పై ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. తమిళ్ నేటివిటీకి చాల దగ్గరగా ఉండే రంగస్థలం మూవీ తమిళ్ లో కూడా మంచి విజయం సాధిస్తుందని మేకర్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. కాగా తెలుగులో రామ్ చరణ్ చేసిన చిట్టిబాబు పాత్ర అక్కడ ఎవరు చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

కాగా రంగస్థలం తమిళ్ వర్షన్ లో హీరోగా మల్టీ టాలెంటెడ్ హీరో లారెన్స్ నటించే అవకాశం కలదట. దీనిపై ఇప్పటికే లారెన్స్ తో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రావచ్చని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం లారెన్స్ అక్షయ్ హీరోగా లక్ష్మీ బాంబ్ తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More