టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ గత చిత్రం “తమ్ముడు” తర్వాత మరో సినిమా చేయడానికి చాలా సమయాన్నే తీసుకోవాల్సి వచ్చింది. మధ్యలో పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లని వదులుకున్న తాను ఫైనల్ గా ఇప్పుడు దర్శక ద్వయం సోము, నర్రి అనే ఇద్దరితో తదుపరి ప్రాజెక్ట్ ని చేస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇటీవల మొదలు కాగా అప్పుడే లీక్స్ కూడా బయటకి వచ్చేసి వైరల్ గా మారాయి.
సింపుల్ మిడిల్ క్లాస్ అబ్బాయి రోల్ లో నితిన్ ఇందులో కనిపిస్తుండగా హీరోయిన్ విషయంలో కూడా ఓ క్లారిటీ ఇప్పుడు వచ్చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట మిరాయ్ బ్యూటీ రితికా నాయక్ ని తీసుకున్నారు కానీ ఆమెని బేబి బ్యూటీ వైష్ణవి చైతన్య రీప్లేస్ చేసినట్టు టాక్ వచ్చింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే లీక్స్ విజువల్స్ లో నితిన్ తో పాటుగా ఆమె కూడా కనిపించడం వైరల్ గా మారింది. సో హీరోయిన్ కూడా మారిపోయినట్టే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి నాగ వంశీ నిర్మాణం వహిస్తున్నారు.


