దాదాపు 50ఏళ్ళ సినీ ప్రస్థానం కలిగిన యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ సౌత్ ఇండియాలో ఒక నటుడిగా ఎనలేని కీర్తిని సంపాదించుకున్నాడు. ఎవరూ చేయనన్ని విభిన్న తరహా పాత్రలని ట్రై చేసి ప్రేక్షకులని నిరంతరం ఎంటర్టైన్ చేయడానికి కృషి చేసే కమల్ నుంచి రానున్న లేటెస్ట్ మూవీ ‘చీకటి రాజ్యం’. ఈ సినిమా నవంబర్ 10న తూంగావనం అనే టైటిల్ తో తమిళ్ లో రిలీజ్ కానుంటే, తెలుగులో మాత్రం నవంబర్ 20న రిలీజ్ కానుంది. ఈ సినిమాని పక్కన పెడితే,, కమల్ లో ఒక నటుడి గానే కాకుండా, స్టొరీ – స్క్రీన్ ప్లే రైటర్ గా, డైరెక్టర్ గా,నిర్మాతగా, టెక్నీషియన్ గా కూడా తన టాలెంట్ ని నిరూపించుకున్నాడు.
ఎప్పటికప్పుడు హాలీవుడ్ కి ధీటుగా టెక్నాలజీ విషయంలో అప్డేట్ గా ఉండే కమల్ తన సినిమాల్లో అన్ని డిపార్ట్ మెంట్స్ లోనూ ఉన్నత సాంకేతిక విలువలు ఉండేలా చూసుకుంటాడు. కానీ ఇండియాలో అడ్వాన్స్ టెక్నాలజీ లేదు. అందుకే కమల్ త్వరలోనే హాలీవుడ్ తరహా సౌండ్ మిక్సింగ్ స్టూడియోని చెన్నై మరియు హైదరాబాద్ లలో ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. ఈ స్టూడియోలో హాలీవుడ్ లో లభించే టెక్నాలజీతో పాటు, ఆ స్టాండర్డ్ టెక్నీషియన్స్ కూడా దొరుకుతారని కమల్ రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపాడు.


