బిఏ రాజు గారి మరణం పట్ల దర్శకేంద్రుడి సంతాపం.!

Published on May 22, 2021 8:47 am IST

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మరియు పి ఆర్ ఓ బి ఏ రాజు గారి మరణ వార్త తెలుగు ఇండస్ట్రీ మొత్తాన్ని కదిలించివేసింది. ఈ వార్త తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా తమ ఆవేదనను వ్యక్తం చెయ్యకుండా ఉండలేకపోతున్నారు.

సూపర్ స్టార్ మహేష్, ఎన్టీఆర్ సహా రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు తమ సంతాపాన్ని వ్యక్తం చేసారు. మరి ఉండగా మన టాలీవుడ్ లెజెండరీ దర్శకులు దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు గారు తన తీవ్ర సంతాపాన్ని తెలియజేసారు.

“బి ఏ రాజు… నువ్వు లేని తెలుగు సినిమా మీడియా మరియు పబ్లిసిటీ, ఎప్పటికీ లోటే… తరతరాలుగా నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీ కి అందించిన సేవలు కలకాలం గుర్తుండిపోతాయి. నీ ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.” అని సోషల్ మీడియా ద్వారా తన సంతాపాన్ని వ్యక్త పరిచారు.

సంబంధిత సమాచారం :