లెజెండరీ సింగర్ ఎస్పీ బాలుకి కరోనా.

Published on Aug 5, 2020 1:46 pm IST

టాలీవుడ్ పై కోవిడ్ పంజా విసురుతుంది. ఇప్పటికే అనేక మంది దీనిబారిన పడ్డారు. నిర్మాత బండ్ల గణేష్, కమెడియన్ పృథ్వి, సింగర్ స్మిత, డైరెక్టర్ తేజా మరియు రాజమౌళి కుటుంబానికి కోవిడ్ సోకడం జరిగింది. దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నా, ప్రముఖులను కూడా వదలడం లేదు. తాజాగా ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా బారినపడినట్లు వార్తలు వస్తున్నాయి.

ఆయనకు కరోనా సోకినట్లు బాలసుబ్రమణ్యం స్వయంగా తెలియజేశారు. కరోనా లక్షణాలు స్వల్పంగా కనిపించడంతో చెన్నైలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ నందు బాలసుబ్రమణ్యం చేరడం జరిగింది. అక్కడ ఆయన కోవిడ్ టెస్టులు నిర్వహించగా, పాజిటివ్ అని తేలడంతో ఆయన్ని ఐసోలేషన్ వార్డ్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐతే తనకు ఎవరు ఫోన్ చేయవద్దని, తనకు ఏమీ కాదని, త్వరలో పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తానని బాలు తెలియజేశారు.

సంబంధిత సమాచారం :

More