‘గంగ’, ‘ఉత్తమ విలన్’లకు గండంగా మారిన రన్ టైం.!

‘గంగ’, ‘ఉత్తమ విలన్’లకు గండంగా మారిన రన్ టైం.!

Published on Apr 30, 2015 1:09 PM IST

uttam-vilan-ganga

ఈ మధ్య కాలంలో సినీమాని చూడడంలో ప్రేక్షకుల దృక్పథం బాగా మారిందని చెప్పాలి. ఒకప్పుడు మూడు గంటల సినిమా తీసినా ఓపిగ్గా చూసిన రోజులున్నాయి కానీ ఇప్పుడు ప్రేక్షకులు కట్టే కొట్టే తెచ్చే అన్న సామెత ప్రకారం సినిమాకి వచ్చామా, షార్ట్ టైంలో ఎంజాయ్ చేసామా, వెళ్ళామా అన్న ఫార్ములాని బాగా ఫాలో అవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ రన్ టైం ఉన్న సినిమాలకు అదే పెద్ద మేజర్ మైనస్ పాయింట్ అయిపొయింది. అలా అని షార్ట్ రన్ టైం ఉన్నా సినిమా బోరింగ్ గా ఉంటే పరాజయాన్ని రుచి చూడాల్సిందే..

ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను అంటే ప్రతి వారంలానే ఈ వారం కూడా రెండు సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నాయి. అవే కమల్ హాసన్ నటించిన ‘ఉత్తమ విలన్’ మరియు రాఘవ లారెన్స్ నటించిన ‘గంగ’. ఈ రెండింటి పైన ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ విమర్శుల నుంచి వినిపిస్తున్న విషయం ఏమిటంటే.. ఈ రెండు సినిమాల నిడివి సుమారు మూడు గంటలు ఉండడం, ఆ సినిమాలకే నష్టం అని అంటున్నారు. ఉత్తమ విలన్ నిడివి 2 గంటల 52 నిమిషాలు అయితే, గంగ సినిమా నిడివి 2 గంటల 45 నిమిషాలు. ఇంత నిడివి ఉన్న సినిమాలు ఎక్కడ స్లో అనిపించినా ఆడియన్స్ బాగా బోర్ ఫీల్ అవుతారు. అది సినిమా సక్సెస్ కి చాలా ప్రమాదం. మరి ఈ రెండు సినిమాలు ఈ రన్ టైం అనే గండం నుంచి సక్సెస్ఫుల్ గా బయటపడి ఆద్యంతం ప్రేక్షకులను రంజింపజేసి హిట్స్ గా నిలుస్తాయా లేక ప్రేక్షకులను నిరుత్సాహ పరుస్తాయా అన్నది చూడాలి.

తాజా వార్తలు