అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ జూలై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మరియు అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన ఎర్లీ మార్నింగ్ షోల వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఓవర్సీస్ అంతటా భారత కాలమానం ప్రకారం జూలై 10న తెల్లవారుజామున 4:30 గంటలకు షోలు ప్రారంభం కానున్నాయి. ఇక ఇండియాలో అదే రోజు ఉదయం 5:00 గంటల నుంచే స్పెషల్ షోలు పడనున్నాయి.
భారీ యాక్షన్ ఎపిసోడ్స్ మరియు ఎమోషన్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘లెనిన్’ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. జూలై 10న థియేటర్లలో అఖిల్ మాస్ జాతరను చూసేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు.
A world you have been waiting to step into…
A story you will carry back with you. ❤️🔥#LENIN in theatres from JULY 10.Shows begin at
India – 5:00 AM IST
Overseas – 4:30 AM IST🎫 https://t.co/xQNsvD4SEq#LeninOnJuly10th pic.twitter.com/FA3uvMLoig
— Annapurna Studios (@AnnapurnaStdios) July 8, 2026


