అజిత్ 60 అప్డేట్ !

అజిత్ 60 అప్డేట్ !

Published on Apr 10, 2019 5:55 PM IST

ajith

ఈ ఏడాది పొంగల్ కు విశ్వాసం తో వచ్చి సూపర్ హిట్ కొట్టిన తల అజిత్ ప్రస్తుతం వరుస సినిమా లతో బిజీ అవుతున్నాడు. అందులో భాగంగా ఇటీవల తన 59వ చిత్రం ‘నెర్కొండ పరవాయ్’ షూటింగ్ ను పూర్తి చేశాడు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని హెచ్ వినోత్ తెరకెక్కిస్తుండగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 10న విడుదలకానుంది.

ఇక ఈ చిత్రం తరువాత అజిత్ మళ్ళీ అదే కాంబినేషన్ లో సినిమా చేయనున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్నఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది. త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

తాజా వార్తలు