మనకు వచ్చే జబ్బులకు కారణం అదే – పూరి

Published on Jun 13, 2021 7:45 pm IST

డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తన పూరీ మ్యూజింగ్స్‌ లో భాగంగా ఈ రోజు ‘లిక్‌ ది బౌల్‌’ అనే అంశం గురించి చెప్పుకొచ్చాడు. పూరి మాటల్లో ‘బుద్ధిజాన్ని ఫాలో అయ్యే వాళ్లను బుద్ధిస్టులు అని పిలుస్తారని మనం చదువుకున్నాం. అయితే, వాళ్ల చేతుల్లో ఎప్పుడూ ఒక పాత్రను మీరు గమనించే ఉంటారు. దాన్నే బిక్షాటన పాత్ర అంటారు. ఆ పాత్రలో కేవలం ఒకసారి ఒక మనిషికి సరిపోయే ఆహారం మాత్రమే ఉంటుంది. ఈ కాన్సెప్ట్‌ ని కనిపెట్టింది బుద్ధుడే.

బుద్ధిజం ఫాలో అయ్యే వాళ్లు, ఒక రోజులో ఒక్కటి లేదా రెండు సార్లు మాత్రమే తింటారు. మిగతా సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోరు. ఉపవాసం ఉంటారు. గిన్నె పెట్టుకుని తినడం వల్ల ఫుడ్‌ కంట్రోల్డ్‌ గా తింటారు. మనకు వచ్చే జబ్బులకు కారణం అధికంగా తీసుకునే ఆహారం మాత్రమే. మీరు తిండి తగ్గించాలంటే ఓరియాకీ సెట్‌ ను వాడండి.

ఐతే, మనలో చాలామంది తక్కువ తింటే నీరసం వస్తుందని అనుకుంటారు. అలా అనుకోకండి, మీరు బలంగానే ఉంటారు. బుదిస్టులు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఇలాంటి ఉపవాసాలు మనం కూడా చేస్తే ఎంతో బాగుంటుంది’ అంటూ పూరీ కొత్త పాఠం వివరించాడు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :