‘ లైగర్ ‘ ఓవర్సీస్ హక్కులు దక్కించుకున్న ప్రముఖ సంస్థ

‘ లైగర్ ‘ ఓవర్సీస్ హక్కులు దక్కించుకున్న ప్రముఖ సంస్థ

Published on Aug 6, 2022 1:30 AM IST

విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ మూవీ లైగర్. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని పూరీ, ఛార్మి లతో కలిసి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. మైక్ టైసన్ కీలక రోల్ చేసిన లైగర్ మూవీ పోస్టర్లు, టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఆడియన్స్, ఫ్యాన్స్ నీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై ఎనలేని అంచనాలు ఏర్పరిచాయి.

మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టెనర్ గా తెరకక్కిన ఈ మూవీ ఆగస్ట్ 25 న విడుదల కానుంది. అయితే ఈ మూవీ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ సంస్థ సరిగమ సినిమాస్ వారు భారీ ధరకు దక్కించుకున్నారు. ఈ విషయాన్ని యూనిట్ కొద్దిసేపటి క్రితం అఫిషియల్ గా అనౌన్స్ చేసింది. అందరిలో ఇప్పటికే ఎంతో హైప్ ఏర్పరిచిన తమ లైగర్ రిలీజ్ తర్వాత మంచి సక్సెస్ అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు