లాస్ వేగాస్ నుంచి హలో చెప్తున్న “లైగర్” టీం.!

Published on Nov 28, 2021 2:00 pm IST

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ హాట్ బ్యూటీ పాండే హీరోయిన్ గా డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ఇండియన్ నుంచి వరల్డ్ లెవెల్ ఇంపాక్ట్ ఉన్న చిత్రం “లైగర్”. బాక్సింగ్ సెన్సేషన్ మైక్ టైసన్ రాకతో ఆ లెవెల్ కి వెళ్ళింది.

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ ని జరుపుకుంటుంది. అయితే ఇప్పుడు లాస్ వేగాస్ లో చిత్ర యూనిట్ ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ నుంచి నిర్మాత ఛార్మి, రౌడీ హీరో విజయ్, దర్శకుడు పూరి జగన్నాథ్ మరియు హీరోయిన్ అనన్య లు హలో చెప్తున్నట్టుగా ఒక ఫోటో షేర్ చేసుకున్నారు.

మరి ఇప్పుడు ఇదే వైరల్ అవుతుంది. అక్కడ కీలక సన్నివేశాల నిమిత్తం వారు వెళ్లారు. ఇది ముగించి వచ్చే పనిలో కూడా ఉన్నారు. ఇక ఈ భారీ సినిమా అన్ని పనులు ముగించుకొని త్వరలోనే ఓ రిలీజ్ డేట్ ని తెచ్చుకోనుంది.

సంబంధిత సమాచారం :