200 కోట్ల ఆఫర్.. నో చెప్పేసిన పూరి

Published on Jun 22, 2021 3:01 am IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తు తెలిసిందే. ‘లైగర్’ అనేది ఈ సినిమా టైటిల్. ఇందులో విజయ్ ఒక ఫైటర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని పూరి భారీ లెవల్లో తెరకెక్కిస్తున్నారు. విజయ్, పూరి జగన్నాథ్ కెరీర్లో ఇదే అతిపెద్ద భారీ బడ్జెట్ సినిమా. ఈ సినిమాకు అవుతున్న ఖర్చు మొత్తం రూ. 125 కోట్లని అంటున్నారు. ఈ సినిమాతో విజయ్ పూర్తిస్థాయి యాక్షన్ హీరోగా మారిపోనున్నాడు. తెలుగుతో పాటు హిందీలో కూడ ఈ సినిమా రూపొందుతోంది.

ఈ చిత్రం మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అందుకే బిజినెస్ వర్గాల్లో సైతం చిత్రం మీద క్రేజ్ ఏర్పడింది. తాజాగా ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులకు సుమారు 200 కోట్ల వరకు ఆఫర్ చేసిందట. అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయాలనే కండిషన్ కూడ పెట్టిందట. కానీ పూరి బృందం ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. ఎందుకంటే సినిమాను ముందుగా థియేటర్లలోనే విడుదల చేయాలనేది వారి నిర్ణయం అందుకే అంత భారీ ఆఫర్ వచ్చినా నో చెప్పేశారట. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ సైతం ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయకిగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :