తమిళంలో రీసెంట్‌గా ‘డ్రాగన్’ అనే సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు హీరో ప్రదీప్ రంగనాథ్. ఇక ఆయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తుండగా అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజాగా ఈ చిత్ర షూటింగ్ మలేషియాలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో ప్రదీప్ రంగనాథ్, కృతి శెట్టి పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. అయితే, వీరి మధ్య సాంగ్ షూట్ చేస్తున్నారా లేక సీన్స్ షూట్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఈ సినిమాను యూత్‌ఫుల్ సబ్జెక్ట్‌తో దర్శకుడు తెరకెక్కిస్తుండగా ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వీలైనంత త్వరగా ముగించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.