బాలయ్య – బోయపాటి చిత్రానికి డేట్స్ సరిపోతాయా ?

Published on Sep 26, 2018 12:20 am IST

నందమూరి నట సింహం బాలకృష్ణ , మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ కలయికలో మూడవ సినిమా తెరకెక్కనుందని తెలిసిందే. ఇక ఈచిత్రాన్నికేవలం 70 రోజుల్లో పూర్తి చేయాలనీ డెడ్ లైన్ పెట్టరట బాలకృష్ణ. మామాలుగానే తన ప్రతి సినిమాకి కొంచెం ఎక్కువగా సమయం తీసుకునే బోయాపాటి ఈచిత్రాన్ని ఇచ్చిన గడువ లోగ పూర్తి చేయడం సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. ప్రస్తుతం బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో నటిస్తూ బిజీ గా వున్నాడు. ఈచిత్ర షూటింగ్ డిసెంబర్ లో పూర్తి కానుంది. ఇక బోయపాటి, రామ్ చరణ్ తో సినిమా తెరకెక్కిస్తూ బిజీ గా వున్నాడు . ఈచిత్ర షూటింగ్ కూడా నవంబర్ చివర్లో పూర్తి కానుంది.

ఇక డిసెంబర్ లో బాలయ్య తన కొత్తచిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకవెళ్లి ఫిబ్రవరి లో షూటింగ్ పూర్తి చేసి ఆ తరువాత ఎన్నికల పనిలో బిజీ గా ఉండాలని భావిస్తున్నాడట. మరి బోయపాటి , బాలయ్య ఇచ్చిన డేట్స్ లో సినిమాను పూర్తి చేస్తాడో లేదో ఇంకా ఎక్స్ట్రా డేట్స్ ఏమైనా అడుగుతాడో చూడాలి. ఇక వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన ‘సింహ, లెజెండ్’ చిత్రాలు ఒక దానికి మించి ఒకటి అద్భుత విజయాన్ని సాదించాయి . దాంతో ఈ మూడవ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకొన్నాయి.

సంబంధిత సమాచారం :