సమీక్ష : లైన్ మ్యాన్ – ఆకట్టుకొని బోరింగ్ డ్రామా

సమీక్ష : లైన్ మ్యాన్ – ఆకట్టుకొని బోరింగ్ డ్రామా

Published on Mar 23, 2024 3:07 AM IST
Line Man Movie Review in Telugu

విడుదల తేదీ : మార్చి 22, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: త్రిగుణ్, కాజల్ కుందర్, బి. జయశ్రీ, నివిక్ష నాయుడు, హరిణి శ్రీకాంత్, సుజయ్ శాస్త్రి, అపూర్వ శ్రీ తదితరులు.

దర్శకుడు: వి రఘు శాస్ట్రీ

నిర్మాత: పర్పుల్ రాక్ ఎంటర్టైనర్

సంగీత దర్శకులు: కద్రి మణికాంత్

సినిమాటోగ్రాఫర్‌: శాంతి సాగర్ హెచ్ జె

ఎడిటింగ్: రఘునాథ ఎల్

సంబంధిత లింక్స్: ట్రైలర్

నటుడు త్రిగుణ్ తాజాగా లైన్ మ్యాన్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కలిగిన మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. మరి ఈమూవీ ఎలా ఉందనేది పూర్తి సమీక్షలో చూద్దాం.

కథ :

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో గల సత్తుపల్లి గ్రామానికి చెందిన లైన్ మ్యాన్ అయిన నట్టు (త్రిగుణ్) తీసుకున్న ఒక వింత నిర్ణయం చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. దేవుడమ్మ (జయశ్రీ) సత్తుపల్లిలో మంత్రసాని. ఆమె అనేక తరాల మహిళలకు వారి పిల్లలకు జన్మనివ్వడంలో సహాయం చేస్తుంది. ఇక దేవుడమ్మ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న ప్రత్యేక సందర్భంలో, గ్రామం అంతా ఆమె యొక్క గ్రాండ్ బర్త్ డే పార్టీని ప్లాన్ చేస్తారు. అయితే అదేసమయంలో నాలుగు ప్రాణాలను కాపాడేందుకు సడన్ గా కరెంటు గ్రిడ్‌ని స్విచ్ ఆఫ్ చేసిన నట్టు, మరికొన్ని రోజులు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని అందరికీ తెలియజేస్తాడు. నట్టు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది మొత్తం కూడా సినిమాలో చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

మంచి నటుడైన త్రిగుణ్ మరొక్కసారి ఈ మూవీలోని నట్టు పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసాడు. ముఖ్యంగా అతడి డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ తో పాటు సెకండ్ హాఫ్ లో పలు సీన్స్ లో మరింతగా ఆకట్టుకున్నాడు. సీనియర్ నటి జయశ్రీ కూడా మంత్రసాని పాత్రలో ఆకట్టుకునే నటన కనబరిచారు.

మైనస్ పాయింట్స్ :

ముఖ్యంగా ఈ మూవీ యొక్క ప్రధాన ఇతివృత్తం ప్రకారం ఇతర జీవుల యొక్క ప్రాణాలు తీసేహక్కు మనకు లేదు, అయితే అదే సమయంలో వాటిని కాపాడేందుకు నిట్టు కొన్నాళ్లపాటు కరెంట్ ఆఫ్ చేసి గ్రామంలోని వారిని ఇబ్బందులకు గురిచేస్తాడు. ఇక ఆ నాలుగు జీవులను కాపాడే క్రమంలో అతడు కరెంట్ కట్ చేయడం వలన ఊరులోని చిన్నపిల్లలు, వృద్దులు సహా పలువురు అనేక ఇబ్బందులు పడే విషయాన్ని మాత్రం సినిమాలో సరిగ్గా చూపించలేదు. దానికి లైన్ మ్యాన్ చూపించిన పరిష్కారం ప్రాక్టికల్ గా అయితే వర్కౌట్ కాదు. ఇక సినిమా ముగింపులో ఇటువంటి అనేక ఘటనల యొక్క పేపర్ క్లిప్స్ ని చూపించడం జరుగుతుంది. కానీ, ఇది జనాభాలో ఎక్కువ మందికి ఆపాదించబడదు. మొబైల్ ఫోన్‌లకు అతుక్కుపోయే విపరీతమైన వ్యసనం మానవ సంబంధాలపై ప్రభావం చూపుతుందనే అంశం కూడా సినిమాలో చూపారు. అయితే మొబైల్ ఫోన్‌లు మాత్రమే కాదు, విద్యుత్‌పై ఆధారపడే అనేక ఇతర అంశాలు ఉన్నాయి, అది లేకుండా జీవించడం సాధ్యం కాదు. ముఖ్యంగా నేటి యుగంలో విద్యుత్ లేనిదే ఏది ముందుకు సాగదనేది మరువకూడదు. మొబైల్ ఫోన్‌లు కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, అవి అనేక విధాలుగా మన జీవితంలో ఒక భాగంగా మారాయి. సోషల్ మీడియా అడిక్షన్‌ అనేది ఎక్కువైందని అంశం సినిమాలో చెప్పి ఉంటే, అది సెన్సిబుల్‌గా ఉండేది. ఈ అంశాల కారణంగా, సందేశం ఇచ్చినట్లయ్యేది. అయితే దాని ఎగ్జిక్యూషన్ చాలా వరకు ఆకట్టుకోలేదు మరియు సినిమా సాంకేతిక విలువల పరంగా బాగా లేదు. ఫస్ట్ హాఫ్‌లో ఏమంత ఆకట్టుకునే అంశాలు ఉండవు. కామెడీ చాలా చిరాకు కలిగిస్తుంది. పాటలు ఎటువంటి కారణం లేకుండా వస్తాయి మరియు అనేక సన్నివేశాలలో చాలా నార్మల్ గా సాగుతాయి. సీన్స్ ఎంతో స్లోగా సాగి మన సహన స్థాయిని పరీక్షిస్థాయి. వేరు వేరు కామెడీ ట్రాక్‌లు మరియు సబ్‌ప్లాట్‌లు ఎటువంటి ప్లస్ కాకపోగా మనల్ని ఇబ్బందిపెడతాయి.

సాంకేతిక వర్గం :

టెక్నికల్ అంశాల పరంగా సినిమాలో పెద్దగా చెప్పడానికి ఏమి లేదు. సంగీతం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ మరియు నిర్మాణ విలువలు కూడా ఆకట్టుకునే స్థాయిలో లేవు. సినిమా ఐడియా, ప్రెజెంటేషన్ అస్సలు కన్విన్సింగ్ గా లేవు. త్రిగుణ్ మరియు మరొక రెండు పాత్రలు తప్ప, ఇతర నటీనటులకు లిప్ సింక్ లేదు. డైలాగ్స్ పేలవంగా రాసారు.

తీర్పు :

మొత్తంగా చెప్పాలంటే లైన్‌మాన్ మూవీ ఆచరణ పరంగా సాధ్యం కాని వింత ఆలోచన చుట్టూ తిరుగుతుంది మరియు కథనం చాలా బోరింగ్‌గా సాగుతుంది. ఈ చిత్రంలో చాలా సన్నివేశాలు డీల్ చేసే కాన్సెప్ట్‌కు భిన్నంగా ఉంటాయి. త్రిగుణ్ మరియు సీనియర్ నటి జయశ్రీల నటన మాత్రమే ఈ విలేజ్ డ్రామాలో గొప్పగా చెప్పుకోవాలి. అందువల్ల, ఈ వారాంతంలో ఇతర సినిమాలను ఎంచుకోవడం మంచిది.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు