రంగ పాత్రలో రజినీకాంత్ కామెడీ.

రంగ పాత్రలో రజినీకాంత్ కామెడీ.

Published on Nov 27, 2014 7:51 PM IST

Linga
సూపర్ స్టార్ రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న తాజా సినిమా ‘లింగ’. ఈ సినిమాలో రంగ పాత్రలో రజినీకాంత్ కామెడీ చేయనున్నాడట. రజినితో కలసి హీరోయిన్ అనుష్క, ప్రముఖ కమెడియన్ సంతానం నటించిన సన్నివేశాలు థియేటర్లో నవ్వులు కురిపిస్తాయని సమాచారం. రంగ పాత్రలో రజిని పలికే మార్క్ పంచ్ డైలాగులు సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తాయని ‘లింగ’ సినిమా సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వచ్చే మరో పాత్రలో రజిని కలెక్టర్ గా కనిపిస్తారు.

కేయస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సోనాక్షి సిన్హా మరొక హీరోయిన్. జగపతి బాబు విలన్. ఏఅర్ రెహమాన్ సంగీత దర్శకుడు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత. ఈరోస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ‘లింగ’ సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. రజినీకాంత్ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 12న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

తాజా వార్తలు