‘లింగ’ సినిమా పరాజయం పాలవడంతో తమ నష్టాలను భర్తీ చేసేవిధంగా హీరో రజినీకాంత్ చర్యలు తీసుకోవాలని కోరుతూ గత గత కొంత కాలంగా డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. వారిపై నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఎదురుదాడి చేశారు. 2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో సూపర్ స్టార్ రజినీకాంత్ ను పోటి చేయకుండా అడ్డుకోవడానికి వేసిన ఎత్తుగడగా దీనిని అభివర్ణించారు. కొందరు తమిళ రాజకీయ నేతలు, వారి బినామీలు ‘లింగ’ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం నా వద్దకు వచ్చారు. అంటూ ఒక ప్రముఖ ఆంగ్ల జాతీయ దినపత్రికలో వెంకటేష్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిర్మాత తమకు పరిహారం అందించాలి అంటూ ట్రిచి మరియు తంజావూరు ఏరియా డిస్ట్రిబ్యూటర్ వెంటనే నిరాహార దీక్ష చేపట్టి నిరసన వ్యక్తం చేయడాన్ని రాక్ లైన్ వెంకటేష్ విమర్శించారు. రజినీకాంత్ త్వరలో రాజకీయాలలోకి వస్తారనే ఆశాభావాన్ని వెంకటేష్ వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయడమే రజనీకాంత్ ధ్యేయమని, డిస్ట్రిబ్యూటర్ల చర్యలు పట్ల రజినీకాంత్ కలత చెందారని తెలిపారు. డిస్ట్రిబ్యూటర్ సంతకం చేసిన ఒప్పంద పత్రాలు ప్రకారం వారికి ఎటువంటి పరిహారం చెల్లించనవసరం లేదని చెప్పారు.


