వినాయక చవితి కానుకగా రజినీ ‘లింగా’ ఫస్ట్ లుక్

వినాయక చవితి కానుకగా రజినీ ‘లింగా’ ఫస్ట్ లుక్

Published on Aug 26, 2014 5:16 PM IST

lingaa
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా ‘లింగా’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం క్లైమాక్స్ షెడ్యూల్ కర్నాటకలోని షిమోగా ప్రాంతంలోని జోగ్ ఫాల్స్ దగ్గర జరుగుతోంది. ఈ క్లైమాక్స్ షెడ్యూల్లో రజినీకాంత్ తో పాటు సోనాక్షి సిన్హా, మిగిలిన ప్రముఖ నటీనటులు కూడా పాల్గొంటున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం ఈ మూవీ ఫస్ట్ లుక్ ని వినాయక చవితి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఫస్ట్ లుక్ గా మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేయనున్నారు. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రజినీకాంత్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడు. అందులో ఒక పాత్ర ప్రస్తుతానికి సంబందించినది అయితే, మరొకటి 1940కి చెందిన పాత్ర. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత. రజినీకాంత్ బర్త్ డే కానుకగా డిసెంబర్ 12న ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.

తాజా వార్తలు