మార్చి 28న ‘లయన్’ ఆడియో.?

మార్చి 28న ‘లయన్’ ఆడియో.?

Published on Mar 10, 2015 3:08 AM IST

balkrishna-lion
నందమూరి నటసింహం బాలకృష్ణ పవర్ఫుల్ సిబిఐ ఆఫీసర్ గా నటించిన సినిమా ‘లయన్’. షూటింగ్ చివరి దశకు చేరుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రసతుతం ఫిలిం నగర్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియోని మార్చి 28న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ముందుగా ఇదే సమయానికి సినిమాని రిలీజ్ చెయ్యాలనుకున్నారు కానీ మధ్యలో బాలకృష్ణకి ఓ సారి చిన్న యాక్సిడెంట్ అవ్వడం వలన, అలాగే ప్రజా సేవలో ఉండడం వలన ఈ చిఎన్మా షూటింగ్ ఆలస్యం అయ్యింది.

సత్యదేవా దర్శకుడుగా పరిచయమవుతూ చేసిన ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఏప్రిల్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బాలకృష్ణ సినిమా షూటింగ్ లతో పాటు ప్రజాసేవకి కూడా సమానంగా సమయాన్ని కేటాయిస్తున్నాడు. బాలకృష్ణ ఈ సినిమా పూర్తి కాగానే శ్రీవాస్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. ఆ సినిమా కూడా మార్చిలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు