
‘లెజెండ్’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘లయన్’. సత్యదేవ్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఆడియో, ట్రైలర్‌లోని డైలాగులు అభిమానులను ఉర్రూతలు ఊగిస్తున్నాయి. పవర్‌ఫుల్ సీబీఐ ఆఫీసర్ పాత్రలో బాలయ్య యాక్టింగ్ ఈ సినిమాకు హైలైట్ అవుతుందని సమాచారం.
తాజాగా ఈ చిత్రం విడుదల తేదీకి సంబంధించిన సమాచారం తెలిసింది. మొదట ‘లయన్’ సినిమాను మేడే సందర్భంగా మే ఒకటిన విడుదల చేయాలనుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఒకరోజు ముందుకు అంటే ఏప్రిల్ 30వ తేదీకి షిఫ్ట్ అయినట్టు ప్రకటించారు. అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమాను మళ్ళీ మే1కే విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. మే 1న మేడే సందర్భంగా విడుదలవుతున్న లయన్ బాలయ్య అభిమానులకు పండగే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాధిక ఆఫ్టే, త్రిషలు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.

