తమిళనాడులో ‘లయన్’ భారీ రిలీజ్

తమిళనాడులో ‘లయన్’ భారీ రిలీజ్

Published on May 12, 2015 8:23 AM IST

lion
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లయన్’. ఈ సినిమా మే 14న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. లయన్ సినిమాని పక్క రాష్ట్రమైన తమిళనాడులో కూడా భారీ ఎత్తున రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. ఈ చిత్ర నిర్మాత రుద్రపాటి రమణారావుతెలుగు వారు ఎక్కడ ఉన్నా వారందరికీ ఈ సినిమాని రీచ్ చెయ్యాలనే ఉద్దేశంతో సినిమాని అన్ని ప్రాంతాల్లో రిలీజ్ చేస్తున్నారు.

ట్రేడ్ పండితులు చెబుతున్న సమాచారం ప్రకారం చెన్నై సిటీ మరియు మిగిలిన తమిళనాడు ఏరియాలలో కలిపి ఎక్కువ థియేటర్స్ లోనే లయన్ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అలాగే బెంగుళూరు, కర్ణాటకలో కూడా ఎక్కువ థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్ర – కర్ణాటక, ఆంధ్ర – తమిళనాడు బార్డర్స్ లో బాలకృష్ణకి ఎక్కువ క్రేజ్ ఉండడం వలన అక్కడ కూడా రికార్డ్ నెంబర్ థియేటర్స్ లో సినిమా రిలీజ్ కానుంది. సత్య దేవా దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమాలో త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా నటించారు. మణిశర్మ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు