ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిన హీరోయిన్ !

ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిన హీరోయిన్ !

Published on Sep 17, 2018 5:29 PM IST


బాలీవుడ్‌ హీరోయిన్‌ మరియు మోడల్ లీసా రే ఆనందానికి ఇప్పుడు అవధులు లేకుండా పోయాయి. ఎందుకంటే ఆమె తల్లి అయ్యారు. అది కవల పిల్లలకు. ప్రస్తుతం ఆ కవలలు విషయంలో ఆమె ఎన్నో భావోద్వేగాలకు గురవుతున్నారట. గతంలో ఆమె క్యాన్సర్‌ తో బాధ పడిన విషయం తెలిసిందే. అయితే క్యాన్సర్ నుంచి కోలుకున్నాక లీసా 2012లో తన స్నేహితుడు జాసన్‌ డేహ్నిని వివాహం చేసుకుంది.

కాగా, వివాహం తర్వాత తమ వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉందని సోషల్ మీడియా ద్వారా తరుచూ తెలిపే లీసా రే.. సరోగసి ద్వారా తనకు ఇద్దరు ఆడపిల్లలు జన్మించారని ఆమె మీడియాతో పంచుకున్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురుకున్నానని, అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డానని.. అయినప్పటికీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని ఆమె తెలిపారు. మీరు కూడా ఏ విషయంలోనైనా తీవ్రంగా బాధ పడుతుంటే, ఆ విషయం శాశ్వతం కాదని తెలుసుకొండి అని లీసా చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు