స్పెషల్: ఈ సమ్మర్ కి సిద్ధమైన టాలీవుడ్ భారీ చిత్రాలు

Published on Feb 1, 2022 3:02 am IST

టాలీవుడ్ లో పలు భారీ చిత్రాలు కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత, పలు సమస్యల కారణాల వలన విడుదలలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా భారీ చిత్రాలు రిలీజ్ డేట్స్ ను ప్రకటించాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి లు పవర్ ఫుల్ పాత్రల్లో నటిస్తున్న మల్టీస్టారర్ భీమ్లా నాయక్. సాగర్ కే చంద్ర దర్శకత్వం లో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిత్యా మీనన్ సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రం ను ఫిబ్రవరి 25 వ తేదీ లేదా ఏప్రిల్ 1 వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని మేకర్స్ సోషల్ మీడియా వేదిక గా ప్రకటించారు.

యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాధే శ్యామ్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చ్ 11 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ గా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. లేటెస్ట్ ప్రకటన తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గత కొద్ది సంవత్సరాలుగా విడుదల కి నోచుకోని ఆర్ ఆర్ ఆర్ మూవీ మరొకసారి రిలీజ్ డేట్ ను మార్చ్ 25 వ తేదీ కి ఫిక్స్ చేసింది. దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రిలీజ్ డేట్ తో పలు చిత్రాలు కొత్త రిలీజ్ డేట్స్ ను ప్రకటించాయి. ఎట్టకేలకు ఆర్ ఆర్ ఆర్ మూవీ మేకర్స్ రిలీజ్ డేట్ ను ప్రకటించడం తో అటు మెగా ఫ్యాన్స్, ఇటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్ ఆర్ ఆర్ మూవీ రిలీజ్ డేట్ ముందుగా ప్రభావం చూపింది మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం కి అని చెప్పాలి. సరికొత్త రిలీజ్ డేట్ తో ఆచార్య ను ఏప్రిల్ 29 వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరొక కీలక పాత్ర లో నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట”. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్, బ్యానర్స్ తో పాటు మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌పై నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కరోనా కారణంగా ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వస్తున్న్న ఈ చిత్రం కూడా తాజాగా కొత్త రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసుకుంది. మే 12, 2022న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఎఫ్3 చిత్రం సరికొత్త విడుదల తేదీ ను ప్రకటించడం జరిగింది. వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో మెహ్రిన్ కౌర్, తమన్నా భాటియా లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఎఫ్ 2 చిత్రానికి కొనసాగింపు గా ఈ చిత్రం ఉండటం, సునీల్ మరొక కీలక పాత్ర లో నటిస్తుండటం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించడం జరిగింది.

ఈ భారీ చిత్రాల ప్రకటనల తో టాలీవుడ్ లో మునుపెన్నడూ లేని విధంగా సినిమాలు ఎంటర్ టైన్మెంట్ అందించనున్నాయి. అంతేకాక ఇంకా పలు చిత్రాలు రిలీజ్ డేట్స్ ను ప్రకటించాల్సి ఉంది. మరికొన్ని ఇతర భాషలకు చెందిన పాన్ ఇండియా చిత్రాల తో ఈ సమ్మర్ సినీ అభిమానులకి సిసలైన పండుగ ను తీసుకు వస్తుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :