సినిమా హిట్టు .. కారు గిఫ్ట్ !

Published on Mar 5, 2019 12:20 pm IST

మూవీ ఇండస్ట్రీ లో సినిమా హిట్ అయితే పారితోషికం తో పాటు ఆ టీం కు కాస్ట్ లీ గిఫ్ట్ లు ఇవ్వడం సర్వ సాధారణం అయిపొయింది. తాజాగా కోలీవుడ్ లో ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయిన చిత్రం ఎల్ కె జి. ప్రముఖ కమెడియన్ ఆర్ జే బాలాజీ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం 15 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

పొలిటికల్ సెటైర్ గా తెరకెక్కిన ఈచిత్రంలో ప్రియా ఆనంద్ కథానాయికగా నటించింది. ఇక ఈ చిత్రం ఓ రేంజ్ లో హిట్ అవ్వడం తో చిత్ర నిర్మాత ఇసరి కె గణేష్ డైరెక్టర్ ప్రభు కి కాస్ట్ లీ కారు ను గిఫ్ట్ గా ఇచ్చాడు. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా రివార్డ్స్ ఇచ్చాడట.

ఇక టాలీవుడ్ లో ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఎఫ్ 2 బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సాధించడం తో చిత్ర నిర్మాత దిల్ రాజు సినిమా యూనిట్ కు ఐ ఫోన్స్ ను బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం :