వర్మ ‘లోఫర్’ అన్న టైటిల్ తీసేయమన్నారు : పూరీ

వర్మ ‘లోఫర్’ అన్న టైటిల్ తీసేయమన్నారు : పూరీ

Published on Dec 8, 2015 1:00 AM IST

puri
మెగా ఫ్యామిలీ నుంచి ఈమధ్యే ఎంట్రీ ఇచ్చిన హీరో వరుణ్ తేజ్, తాజాగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో ‘లోఫర్’ పేరుతో ఓ మాస్ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. మదర్ సెంటిమెంట్‌ను హైలైట్ చేసుకొని తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 18న విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సాయంత్రం ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుకను హైద్రాబాద్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించారు. ఈ వేడుకకు ‘లోఫర్’ యూనిట్‌తో పాటు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ప్రభాస్ ఆడియోను విడుదల చేసి మొదటి సీడీని రామ్ గోపాల్ వర్మకు అందజేశారు. ఇక ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. “‘అమ్మా నాన్నా ఓ తమిళ అమ్మాయి’ తర్వాత ఆ స్థాయిలో మదర్ సెంటిమెంట్‌తో నేను మళ్ళీ సినిమా చేయలేదు. అప్పట్లో ఎందుకయ్యా ఈ సెంటిమెంట్‌లు అన్న వర్మ గారే ఇప్పుడు ఈ సినిమా చూసి ‘లోఫర్’ అనే టైటిల్ తీసేసి ‘మా అమ్మ సీతామాలక్ష్మి’ అనే పేరు పెట్టు అన్నారు. మదర్ సెంటిమెంట్ అందరికీ నచ్చేలా ఉంటుంది. రేవతి, పోసానిలు ఆ పాత్రల్లో ఒదిగిపోయారు. వరుణ్ తేజ్ గ్రేట్ యాక్టర్ అవుతాడు” అని అన్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన దిశా పటాని హీరోయిన్‌గా నటించగా సీ.కళ్యాణ్ నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు