జైసల్మీర్‌కు షిఫ్టైన ‘లోఫర్’ టీమ్..!

జైసల్మీర్‌కు షిఫ్టైన ‘లోఫర్’ టీమ్..!

Published on Aug 13, 2015 8:48 PM IST

varun-tej
మెగా ఫ్యామిలీ నుంచి కొత్తగా పరిచయమైన ఆరడుగుల అందగాడైన హీరో వరుణ్ తేజ్. మొదటి సినిమా ముకుందాతోనే మంచి మార్కులు కొట్టేసిన వరుణ్, ఆ తర్వాత విలక్షణ దర్శకుడు క్రిష్‌తో ‘కంచె’ అనే సినిమా, పూరీ జగన్నాథ్‌తో లోఫర్ అనే సినిమా.. ఇలా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘కంచె’ అక్టోబర్‌లో విడుదల కానుండగా, పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న లోఫర్ రాజస్థాన్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.

గత నెలలో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో మొదలైన లోఫర్ షెడ్యూల్ నిర్విరామంగా కొనసాగుతోంది. ఇక జోధ్‌పూర్‌లో కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న యూనిట్ ప్రస్తుతం జై సల్మీర్‌కు షిఫ్ట్ అయింది. మరికొన్ని రోజుల పాటు జై సల్మీర్‌లోనే లోఫర్ షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. జై సల్మీర్‌కు సినిమా యూనిట్ పయనమైన సందర్భంగా దర్శకుడు పూరీ, వరుణ్ తేజ్‌లు ఓ ఫోటో దిగి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. రాజస్థాని అవతారంలో కనిపిస్తున్న పూరీని ఈ ఫోటోలో చూడొచ్చు. సి. కళ్యాణ్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాలో దిశా పఠాని హీరోయిన్‌గా నటీస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు