లోకల్ యూఎస్ ఎగ్జిబ్యూటర్లను డైలమాలో పడేసిన డియర్ కామ్రేడ్ !

Published on Apr 26, 2019 1:00 am IST

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన గీతగోవిందం తెలుగు రాష్ట్రాల్లో అలాగే యూఎస్ లో కలెక్షన్ల వర్షం కురిపించింది. దాంతో విజయ్ నటిస్తున్న సినిమాలకు అక్కడ ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇక విజయ్ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క ఓవర్సీస్ హక్కులను భారీ ధరకు అమ్మారు నిర్మాతలు.

అయితే ఈ హక్కులనుదక్కించుకున్న డిస్ట్రిబ్యూషన్ సంస్థ అక్కడున్న లోకల్ ఎగ్జిబ్యూటర్లకు ఎక్కువ ధర ను కోట్ చేస్తుందట. ఇక ఇటీవల విడుదలైన జెర్సీ పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకున్న ఓవర్సిస్ లో ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ కాలేకపోయాయి. దాంతో ఇప్పుడు డియర్ కామ్రేడ్ కూడా ఒక వేళా అలాగే జరిగితే పరిస్థితి ఏంటని ఎగ్జిబ్యూటర్లు డైలమా లో ఉన్నారట.

మరి ఎగ్జిబ్యూటర్లు , విజయ్ దేవకొండ ను చూసి ముందు కోట్ చేసిన ధరలకే ఈహక్కులను సొంతం చేసుకుంటారో లేక ఎగ్జిబ్యూటర్ల కోరిక మేరకు మేకర్స్ ధరలను తగ్గిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :