‘మహర్షి’ గ్రాండ్ సక్సెస్ మీట్ కి ప్లేస్ ఫిక్స్ !

Published on May 16, 2019 8:36 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రిలీజ్ అయి వారం రోజులు అవుతున్న ‘మాహర్షి’ కలెక్షన్స్ మాత్రం చాలా ఏరియాల్లో ఇంకా స్టడీగానే ఉన్నాయి. ఇప్పటికే నైజాంలో మహర్షి బ్రేక్ ఈవెన్ అయింది. పైగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డు ను కూడా బ్రేక్ చేసింది.

అందుకే చిత్రబృందం మాహర్షి విజయోత్సవ వేడుకను విజయవాడలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ వేడుకకు ప్లేస్ ని ఫైనల్ చేసింది చిత్రబృందం. ఈ నెల 18వ తేదీన సాయంత్రం ఆరు గంటలకు సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్ లో మహర్షి గ్రాండ్ సక్సెస్ మీట్ ను నిర్వహించనున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించింది. అలాగే ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :

More