లాక్ డౌన్ రివ్యూ: ఆర్య హిందీ వెబ్ సిరీస్(హాట్ స్టార్)

లాక్ డౌన్ రివ్యూ: ఆర్య హిందీ వెబ్ సిరీస్(హాట్ స్టార్)

Published on Jun 21, 2020 3:50 PM IST

నటీనటులు: సుష్మితా సేన్, చంద్రచూర్ సింగ్, సికందర్ ఖేర్, మాయ సరవో, జయంత్ కృకలాని

స్ట్రీమింగ్ ఆన్: డిస్నీ + హాట్‌స్టార్

సృష్టించినది: రామ్ మాధ్వని

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు హిందీ వెబ్ సిరీస్ ఆర్య ను ఎంచుకోవడం జరిగింది. హీరోయిన్ సుస్మితా సేన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…

 

కథాంశం ఏమిటీ?

వ్యాపారవేత్త తేజ్ సరీన్(చంద్రచూర్ సింగ్) భార్య అయిన ఆర్య(సుస్మితా సేన్) తన ముగ్గురు పిల్లలతో హ్యాపీ లైఫ్ అనుభవిస్తూ ఉంటుంది. ఆర్య భర్త తేజ్ ని గుర్తు తెలియని వ్యక్తులు చంపివేయడంతో ఆమె జీవితంలో సమస్యలు మొదలవుతాయి. ఆమె భర్త వెనుక ఉన్న నేర సామ్రాజ్యం ఆమె కుటుంబానికి ప్రమాదంగా మారుతుంది. దీనితో ఆర్య తన భర్తను చంపిన వారి కోసం వేట మొదలుపెడుతుంది. అసలు తేజ బ్యాక్ గ్రౌండ్ ఏమిటీ? అతన్ని చంపింది ఎవరు? ఆర్య, తేజాను చంపిన వారి నుండి తన పిల్లల్ని ఎలా కాపాడుకుంది? అనేది మిగతా కథ..

 

ఏమి బాగుంది?

హీరోయిన్ సుస్మిత సేన్ తన నటనతో సిరీస్ కి గొప్ప ఆకర్షణ తీసుకువచ్చింది. తన పిల్లల కోసం మాఫియా పై తిరగబడిన బ్రేవ్ మదర్ గా ఆమె ఫెరోషియస్ రోల్ ప్రేక్షకుడిని సిరీస్ లో ఇన్వాల్వ్ చేసింది. ఇక కీలక రోల్ చేసిన సికందర్ ఖేర్ మరియు సీనియర్ నటుడు చంద్రాచూర్ సింగ్ మెప్పిస్తారు.

ఈ సిరీస్ చెప్పుకోదగిన మరో అంశం బీజీమ్. సన్నివేశాలు మంచి ఫీల్ లో నడిచేలా బీజీఎమ్ ప్రధాన భూమిక పోషించింది. తేజ్ మర్డర్ వెనుక ఎవరున్నారు అనే సస్పెన్సు బాగా క్యారీ అయ్యింది. స్టోరీ నేరేషన్ కూడా బాగుంది.

 

ఏమి బాగోలేదు?

సుదీర్ఘమైన నిడివి కలిగిన మెల్లగా సాగే ఎపిసోడ్స్ ఒక దశలో విసుగుపుట్టిస్తాయి. ఎడిటింగ్ వైఫల్యం వలన చాలా అనవసర సన్నివేశాలతో సిరీస్ నిండిపోయింది.

 

 

చివరి మాటగా

మొత్తంగా చెప్పాలంటే.. కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, యాక్షన్ తో సాగే ఈ క్రైమ్ డ్రామా ఆసక్తికరంగానే సాగుతుంది. మెల్లగా సాగే సుదీర్ఘమైన ఎపిసోడ్స్ నిరాశపరిచే అంశాలు. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారు ఓసారి చూసి ఎంజాయ్ చేయదగ్గ సిరీస్ గా చెప్పవచ్చు.

Rating: 3/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు