లాక్ డౌన్ రివ్యూ: డ్యానీ- తమిళ్ మూవీ(జీ5)

లాక్ డౌన్ రివ్యూ: డ్యానీ- తమిళ్ మూవీ(జీ5)

Published on Aug 4, 2020 5:14 PM IST

నటీనటులు: వరలక్ష్మి శరత్‌కుమార్
దర్శకత్వం: ఎల్.సి.శాంతనమూర్తి
నిర్మించినవారు: పి. జి. ముత్తయ్య
సంగీతం: సాయి భాస్కర్
సినిమాటోగ్రఫీ: బి ఆనంద్‌కుమార్
ఎడిట్ చేసినవారు: ఎస్ఎన్ ఫాజిల్

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు తమిళ చిత్రం డ్యానీ ని ఎంచుకోవడం జరిగింది. వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…

 

కథాంశం ఏమిటీ?

 

ఓ యువతిని కొందరు యువకులు అత్యంత దారుణంగా చంపడం జరుగుతుంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి లేడీ ఇన్స్పెక్టర్ కుంతవి(వరలక్ష్మీ శరత్ కుమార్) రంగంలోకి దిగుతుంది. ఈ కేసును ఛేదించడం కోసం కుంతవి పోలీస్ డాగ్ డ్యానీ సాయం తీసుకుంటుంది. మరి డ్యానీ సహాయంతో కుంతవి ఆ హంతకులను ఎలా పట్టుకుంది అనేది మిగతా కథ.

 

ఏమి బాగుంది?

 

రూత్ లెస్ అండ్ సీరియస్ పోలీసుగా వరలక్ష్మీ నటన అద్బుతం అని చెప్పాలి. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ఒకేఒక్క అంశం ఆమె నటన. పోలీసు పాత్రలో ఆమె ఎక్స్ప్రెషన్స్ మరియు బాడీ లాంగ్వేజ్ అలరిస్తాయి.

ఇక ఓ అమ్మాయి ఘోరమైన మర్డర్ గురించిన సన్నివేశాలు, మరియు నేపథ్యం ఆకట్టుకుంటాయి. అనిత సంపత్ మరియు సాయాజీ షిండే పాత్రలు సినిమాలు ఆకట్టుకొనే అంశాలు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. బీజీఎమ్ అలరిస్తుంది.

 

ఏమి బాగోలేదు?

 

మూవీలో సపోర్టింగ్ క్యాస్ట్ ప్రధాన బలహీనత అని చెప్పాలి. తక్కువ బడ్జెట్ మూవీ కావడంతో క్యాస్టింగ్ విషయంలో శ్రద్ధ తీసుకోలేదు. ఇక 95 నిమిషాల నిడివి కలిగిన ఈ చిత్రంలో అలరించే కథనం కానీ సస్పెన్సు కానీ లేవు.

అసలు టైటిల్ కి మరియు సినిమాకు సంబంధం లేదని చెప్పాలి. పోలీస్ డాగ్ పేరు టైటిల్ గా పెట్టి అక్కడ షో మొత్తం వరలక్ష్మీ చేత నడిపించారు. ఫస్ట్ హాఫ్ మూవీ కొంచెం పర్వాలేదు అనిపించినా, సెకండ్ హాఫ్ పూర్తిగా నిరాశపరిచింది. ప్రేక్షకుడు అంచనాలకు అందుతూ సన్నివేశాలు ఏమాత్రం ఆసక్తి కలిగించలేకపోయాయి.

 

చివరి మాటగా

 

మొత్తంగా డ్యానీ మూవీలో వరలక్ష్మీ నటన మినహాయిస్తే, చెప్పుకోవడానికి ఏమి లేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం పర్లేదు అనిపించినా, సెకండ్ హాఫ్ పూర్తిగా నిరాశపరిచింది. లాక్ డౌన్ సమయంలో ఈ మూవీ జోలికి వెళ్ళకుంటేనే మంచిది.

Rating: 2/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు