లాక్ డౌన్ రివ్యూ : ‘ఫ్రెంచ్ బిర్యానీ’ (అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం)

Published on Jul 27, 2020 2:18 pm IST

తారాగణం: డానిష్ సేట్, సాల్ యూసుఫ్ తదితరులు

దర్శకత్వం: పన్నగా భరణ

నిర్మాత : అశ్విని పునీత్ రాజ్‌కుమార్

సంగీతం : వాసుకి వైభవ్

ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను సమీక్షించే శ్రేణిని కొనసాగిస్తూ.. నేటి సినిమాగా వచ్చిన సినిమా ‘ఫ్రెంచ్ బిర్యానీ’. పన్నగా భరణ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ‘అమెజాన్ ప్రైమ్‌’లో అందుబాటులో ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

కథా నేపథ్యం :

ఒక ఫ్రెంచ్ జాతీయుడు సైమన్ (సాల్ యూసుఫ్) బెంగుళూరులో అడుగుపెడతాడు. లోకల్ మాఫియా హెడ్ మజిల్ మణి (మహంతేష్ హిరేమత్) తరువాత సైమనే లీడ్ గా ఉంటాడు. డాన్ ఆటో డ్రైవర్, అస్గర్ (డానిష్ సైట్) ఈ ఫ్రెంచ్ జాతీయుడిని మాదకద్రవ్యాల పెడ్లర్‌ అని తప్పుగా అర్ధం చేసుకుంటాడు. కానీ లోకల్ ముఠా సైమన్ కాకుండా మరో ఫ్రెంచ్ వ్యక్తి ఉన్నారని వారు భావిస్తారు. మొత్తానికి ఈ తప్పు ఐడెంటిటీలతో ఒకదానితో ఒకటి మిస్ అండర్ స్టాండింగ్ డ్రామాతో ముడిపడి సాగే కథనంలో చివరికీ ఏమి జరిగిందనేది మిగతా కథ.

ఏం బాగుంది :

వైరల్ వీడియోలతో ఫేమస్ అయిన డానిష్ సైట్ ఈ చిత్రంతో అరంగేట్రం చేసినా.. అతను ఆటో డ్రైవర్ పాత్రలో చాలా బాగా నటించాడు. తన వైరల్ వీడియోలలో చూసినట్లుగా అతను తన నాచ్యురాల్ ఈజ్ తో సినిమాలో లేనప్పటికీ, డానిష్ తన ప్రధాన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. మిస్ అండర్ స్టాండింగ్ కామెడీ కాన్సెప్ట్ ద్వారా సృష్టించబడిన కొన్ని కామెడీ సీన్స్ అండ్ పంచ్‌లు కూడా సరదాగా సాగాయి. ఈ చిత్రంలో మంచి కామెడి ఉంది .

అలాగే, సాల్ యూసుఫ్ ఫ్రెంచ్ జాతీయుడిగా నటించిన విధానం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. అతను చెప్పిన పంచ్ లైన్స్ మరియు డైలాగులు చాలా బాగున్నాయి. పైగా కన్నడం అయినప్పటికీ భాష అందరికీ అర్థమయ్యేలా ఉంది. కథనం చక్కగా సాగింది. మరియు కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. క్రైమ్ కోణం మరియు తరువాతి భాగంలో వివిధ థ్రెడ్స్ ఎలా ముగిసాయి అనేది కూడా ఆసక్తిగా అనిపిచింది.

ఏం బాగాలేదు :

దర్శకుడు తన పాత్రలను కథలో చక్కగా పొందుపరిచినా.. కొన్ని సీన్స్ ను రెగ్యులర్ గా రాసుకున్నాడు. అలాగే కథను కూడా బాగా ఎలివేట్ చేయలేకపోయాడు. పైగా మెయిన్ పాయింట్ కి దూరంగా, చాలా అనవసరమైన సన్నివేశాలు ఒకదాని తరువాత ఒకటి జోడించడంతో కథ పట్టును కోల్పోయింది. అలాగే, చాలా గందరగోళాన్ని ప్రదర్శించే కొన్ని పాత్రలు కూడా విసిగించాయి.

ఇలాంటి సినిమాలో ఆహ్లాదకరమైన క్లైమాక్స్ ను ఆశిస్తారు, కానీ అది అస్సలు లేదు. సినిమా ముగింపు అసలు బాగాలేదు. కామెడీ కూడా అందరికీ అర్థం కాదు. ఎందుకంటే దీనిలో భిన్నమైన హాస్యం ఉంది, అది కొంచెం కన్ ఫ్యూజ్ద్ గా ఉంటుంది. పైగా అవసరమైన కామెడీ సీన్స్ ఎక్కువుగా ఉన్నాయి.

చివరి మాటగా :

మొత్తంమీద, ఈ ‘ఫ్రెంచ్ బిర్యానీ’ ఒక క్రైమ్ కామెడీ డ్రామా, మిస్ అండర్ స్టాండింగ్ ప్లే మీద ఆధారపడి ఈ సినిమా ఉంటుంది. ఇక డానిష్ సైట్ తన ప్రధాన పాత్రలో బాగా నటించాడు. కామెడీ సీన్స్ పర్వాలేదు. అయితే ఈ చిత్రం క్లైమాక్స్‌లో బాగా నిరుత్సాహ పరుస్తోంది. అయితే హాస్యాన్ని బాగా ఇష్టపడేవారికి డానిష్ సైట్ పూర్తి స్థాయి పాత్రలో ఏమి చేసాడో చూడాలనుకునే వారికి ఈ సినిమా పర్వాలేదనిపిస్తోంది. కానీ మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చదు.

Rating: 2.5/5

సంబంధిత సమాచారం :

More