లాక్ డౌన్ రివ్యూస్: వరనే అవశ్యముంద్ మలయాళం ఫిల్మ్(నెట్ ఫ్లిక్స్ అండ్ సన్ నెక్స్ట్)

లాక్ డౌన్ రివ్యూస్ లో నేడు ఈ ఏడాది విడుదలైన మలయాళ ఫిల్మ్ వరనే అవశ్యముంద్ తీసుకోవడం జరిగింది. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించి నటించగా, దర్శకుడు అనూప్ సత్యన్ తెరకెక్కించారు. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ మరియు సన్ నెక్స్ట్ లో అందుబాటులో ఉంది.

 

కథాంశం ఏమిటీ?

భర్త లేని నీనా(శోభన) కూతరు నిక్కీ(కళ్యాణి ప్రియదర్శిని) తో కలిసి చెన్నైలోని ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటుంది. నీనా డాన్స్ టీచర్ గా పిల్లలకు పాఠాలు చెవుతూ ఉండగా, నిక్కీ మాత్రం వాళ్ల అమ్మకు మళ్ళీ పెళ్లి చేయాలని, మ్యాట్రిమోని సైట్స్ లోఆమె వయసుకుతగ్గ వరుడు కోసం వెతుకుతూ ఉంటుంది. అదే అపార్ట్మెంట్ లో ఒక మధ్య వయస్కుడైన మేజర్(సురేష్ గోపి) మరియు బిబేష్(దుల్కర్ సల్మాన్) రాకతో వారి జీవితాలలో కొత్త సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆ ఇద్దరు తల్లీ కూతుళ్ళ జీవితాలలో కొత్త బంధాలు తెచ్చిన మార్పు ఏమిటీ? చివరికి వారి కథ ఎలా ముగిసింది అనేది మిగతా కథ..

 

ఏం బాగుంది?

ప్రొఫెషనల్ డాన్సర్ మరియు మంచి నటిగా పేరున్న శోభన తన పాత్రకు చాలా సహజ నటన కనబరిచి ఆకట్టుకుంది. సరేష్ గోపితో ప్రేమ సన్నివేశాలలో ఆమె మెచ్యూర్డ్ పెరఫార్మెన్సుతో మెప్పించారు. సీనియర్ హీరో సురేష్ గోపి గతంలో ఇలాంటి పాత్ర చేసి వుండరు. మాస్ అండ్ యాక్షన్ హీరోగా పేరున్న సురేష్ గోపి ఎమోషనల్ సన్నివేశాలలో మెప్పించగలడని నిరూపించారు.

రెండు భిన్న షేడ్స్ కలిగిన పాత్రలో దుల్కర్ సల్మాన్ నటనలో వేరియేషన్స్ తో నటించారు. పాత్రలో సెటిలై ఆయన నటించిన తీరు బాగుంది. ఇక మోడరన్ భావాలు కలిగిన యువతి పాత్రలో కళ్యాణి ప్రియదర్శి మెప్పించింది.

 

ఏం బాగోలేదు?

ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఓన్లీ ఎమోషన్స్ పై చిత్రాన్ని తెరకెక్కించారు. స్లోగా సాగే కథనంలో మొదటి అరగంట పాత్రలు పరిచయం చేయడానికే సరిపోయింది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కినప్పటికీ పాత్రల మధ్య బలమైన సంఘర్షణ లేకపోవడం మైనస్ గా మారింది.

 

చివరి మాటగా

రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన వరనే అవశ్యముంద్ కి ప్రధాన పాత్రలు చేసిన శోభన, సురేష్ గోపి, దుల్కర్, కళ్యాణి ప్రియదర్శిల నటన అక్కడక్కడా ఆకట్టుకొనే ఎమోషన్స్ తో మంచి అనుభూతినే ఇస్తుంది. మెల్లగా సాగే కథనం కొంచెం ఇబ్బంది పెట్టే అంశం. మొత్తంగా ఈ సినిమాని ఒకసారి ఎంజాయ్ చేయొచ్చు.

123telugu.com Rating : 3/5

సంబంధిత సమాచారం :

X
More