ఆ సినిమాలో నన్ను చూసి షాక్ అవుతారు – సాయి పల్లవి !
Published on Jun 16, 2018 6:32 pm IST

శర్వానంద్, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పడి పడి లేచె మనసు’. ఈ చిత్రంలో తన క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్తుంది సాయిపల్లవి. ఇంతకుముందెప్పుడూ ఇలాంటి క్యారెక్టర్ తాను చెయ్యలేదని, ఈ సినిమాలో నా పాత్రను చూశాకా అందరూ షాక్ అవుతారని, కొత్తగా ఉంది అంటరాని చెప్పుకొచ్చింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చెయ్యాలని చిత్రబృందం నిర్ణయించుకుందనే విషయాన్ని కూడా సాయిపల్లవి తన ట్వీటర్ ద్వారా తన అభిమమానులతో పంచుకున్నారు.

తాజా సమాచారం ప్రకారం ‘పడి పడి లేచె మనసు’ చిత్రబృందం త్వరలోనే డార్జిలింగ్ లో షూట్ కోసం బయలుదేరనుందట. ఆ తర్వాత కలకత్తా లో షూట్ చేస్తారని తెలుస్తోంది. దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చిత్రీకరిస్తున్నారు. దాంతో ‘పడి పడి లేచె మనసు’ చిత్ర షూటింగ్ చాలా స్లోగా నడుస్తోందని టాక్. మరీ దర్శకనిర్మాతలు అనుకున్న విధంగానే సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకొస్తారో లేదో చూడాలి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook