నవీన్, కుసుమ చందక జంటగా నటించిన ‘లవ్ డేస్’ (ఏ టాక్సిక్ లవ్ స్టోరీ) చిత్ర టైటిల్, గ్లింప్స్‌ను ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆన్ క్యాన్ ఎంటర్టైన్మెంట్స్, క్రిసెంట్ సినిమాస్ బ్యానర్ల మీద మాదల వెంకటకృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి సురేష్ లంకలపల్లి దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు సముద్ర మాట్లాడుతూ, ‘గీతాంజలి’, ‘తొలి ప్రేమ’ వంటి అద్భుతమైన ప్రేమ కథల సరసన ‘లవ్ డేస్’ నిలవాలని, పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
దర్శకుడు సురేష్ లంకలపల్లి మాట్లాడుతూ, నిర్మాత వెంకట్ వల్లే ఈ కథ, సినిమా ఇంత దూరం వచ్చిందని తెలిపారు. నటీనటులు, సాంకేతిక బృందం అంకితభావంతో పనిచేశారని పేర్కొన్నారు. నిర్మాత మాదల వెంకటకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, సురేష్ లంకలపల్లి కథ, డెడికేషన్ తనకు బాగా నచ్చాయని, భవిష్యత్తులో కూడా ఆయనతో సినిమాలు చేస్తానని, తన నాలుగో చిత్రంలో ఆయనే హీరోగా నటిస్తారని ప్రకటించారు. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. సహ నిర్మాత రియాజ్, నటీనటులు నవీన్, కుసుమ, సూరజ్ ఆదిత్య సింగ్ తమ అనుభవాలను పంచుకుంటూ, సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కుసుమ మాట్లాడుతూ, హీరోయిన్ కావాలనే తన తల్లి కోరిక ఈ సినిమాతో నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు.



