“లవ్ స్టోరీ” చార్ట్ బస్టర్ కి మరో సాలిడ్ రికార్డ్.!

Published on Jun 22, 2021 4:00 pm IST

అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “లవ్ స్టోరీ”. ఎప్పుడు నుంచో రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న ఈ సినిమాలో సంగీత దర్శకుడు పవన్ సిహెచ్ ఇచ్చిన మ్యూజిక్ ఆల్బమ్ కూడా ఎంత పెద్ద హిట్టయ్యిందో చూసాం. మరి వాటిలో సాయి పల్లవిపై స్పెషల్ సాంగ్ “సారంగ దరియా” మ్యూజికల్ సెన్సేషన్ అయ్యింది.

మన సౌత్ ఇండియా లోనే ఫాస్టెస్ట్ వ్యూస్ తో 100 నుంచి 200 మిలియన్ వ్యూస్ తో భారీ రికార్డు సెట్ చేసింది. మరి ఇప్పుడు మరో 50 మిలియన్ వ్యూస్ తో మొత్తం 250 మిలియన్ భారీ వ్యూస్ తో సరికొత్త రికార్డును ఈ సాంగ్ అందుకుంది. మరి భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం ఎప్పుడు విడుదల కానుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు అమిగోస్ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :