డే 1 అదిరే వసూళ్లు రాబట్టిన “లవ్ స్టోరీ”.!

Published on Sep 25, 2021 10:00 am IST

అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “లవ్ స్టోరీ”. ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రాన్ని మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. తన కంటెంట్ అండ్ టేకింగ్ పై ఎప్పుడూ మంచి అంచనాలే ఉంటాయి టైం పట్టినా కూడా కొన్నాళ్ళు అలా గుర్తిండిపోయే సినిమాలనే కమ్ముల ఇస్తారని ఉన్న ఒక బలమైన నమ్మకం ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు పెంచింది.

మరి ఎట్టకేలకు కొన్ని ఒడిదుడుకులు దాటుకొని ఈ చిత్రం నిన్న రిలీజ్ అయ్యి భారీ రెస్పాన్స్ కొల్లగొట్టింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ దగ్గర కూడా ఈ ఏడాది రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. మరి ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా 8.5 కోట్ల షేర్ ని రాబట్టినట్టుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

అంతే కాకుండా ఒక్క నైజాం వరకే ఈ చిత్రం మూడున్నర కోట్లు రాబట్టిందట. దీనిని బట్టి ఈ చిత్రం సెన్సేషన్ ఏ లెవెల్లో ఉందొ మనం అర్ధం చేసుకోవచ్చు. అంతే కాకుండా తెలుగు ఆడియెన్స్ కూడా ఇందుకు ప్రధాన కారణం అని చెప్పి తీరాలి. ఎలాగో మౌత్ టాక్ కూడా బాగుంది కాబట్టి మొత్తానికి మాత్రం లవ్ స్టోరీ ఫుల్ రన్ లో కూడా మంచి ఎండింగ్ ఇచ్చేలా ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :