“లవ్ స్టోరీ” రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా?

Published on Aug 13, 2021 12:00 am IST

అక్కినేని నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా ఫీల్ గుడ్ చిత్రాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్ర “లవ్ స్టోరీ”. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే గత నెలలో సినిమా థియేటర్లు మళ్లీ తెరుచుకోవడంతో చిన్న చిన్న సినిమాలన్ని వరుసపెట్టి రిలీజ్ అవుతున్నాయి.

అయితే ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు వస్తుండడంతో “లవ్ స్టోరీ” సినిమా కూడా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుందన్న టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాను వచ్చే నెల 10వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :